Tuesday, April 30, 2024

కిడ్నీ రాకెట్ సూత్ర‌ధారి అరెస్ట్

విశాఖ -కై-ం, ప్రభ న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచల నం సృష్టించిన విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసును ఎట్టకేలకు విశాఖ పోలీసులు ఛేదించారు. కిడ్నీ మార్పిడి కేసులో ఓ డాక్టర్‌ సూత్రధారిగా వ్యవహరించారని పోలీసు కమిషనర్‌ సీఎం త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. ఆదివారం మీడియా సమావేశం మందిరంలో ఈ కేసు పూర్వాప రాలు వెల్లడించారు. పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని దళారుల సాయంతో ఇద్దరు వైద్యులు ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారని వెల్లడించారు. వీరిలో నార్ల వేంకటేశ్వరరావు అనే డాక్టర్‌ కీలకంగా వ్యవహరించారని, డాక్టర్‌ పరమేశ్వర రావుతోపాటు ఐదుగురు దళారులు కామరాజు, శ్రీను, శేఖర్‌, ఎలీనా, కొండమ్మను అరెస్టు చేశామని చెప్పారు. పెందుర్తి శ్రీ తిరుమల ఆస్పత్రిలోనే బాధితులు వినయ్‌ కుమార్‌, వాసుపల్లి శ్రీనివాస్‌ రావుకు ఆపరేషన్‌ జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి నార్ల వేంకటేశ్వరరావు గతంలో శ్రద్ధ హాస్పిటల్‌లోనూ అక్రమంగా కిడ్నీ మార్పిడి చేశారని, ఆ క్ర‌మంలో జైలుకు కూడా వెళ్లాడని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు.. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశముంది. నిందితులపై ఐపీసీ 307, 326, 420 కేసులు నమోదు చేసి నిందితులకు రిమాండ్‌ విధించినట్లు- సీపీ త్రివిక్రమ్‌ వర్మ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement