Friday, December 6, 2024

AP: ఈనెల 21 ఎకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్… జీవీఎంసీ కమిషనర్

విశాఖపట్నం: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ విశాఖ నగరాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో, ఎకో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా “ఎకో -వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్” కార్యక్రమాన్ని జనవరి 21న పోర్ట్ స్టేడియం లో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్స్ నందు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించడం జ‌రుగుతుంద‌ని జీవీఎంసీ కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు.

ఈ కాంటెస్ట్ లో 15 సం..ల వయసు లోపు వారు జూనియర్ గ్రూప్ లో, 15 సంవత్సరాల పైబడిన వారు సీనియర్ గ్రూప్ లో పాల్గొనవచ్చని, సీనియర్ గ్రూప్‌లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గెలుపొందిన వారికి 25, 15, 10 వేల రూపాయల నగదును, జూనియర్ గ్రూప్ నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుపొందిన వారికి 15,10,7 వేల రూపాయల నగదును , రెండు గ్రూపులలో 50 మందిని ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఆసక్తి కల ఔత్సాహిక చిత్రకారులు జీవీఎంసీ ఎకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ నందు పాల్గొని నగదు బహుమతులను గెలుపొందగలరని జీవీఎంసీ కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు.

చిత్రలేఖనంపై ఆసక్తి కల ఔత్సాహికులు వారి సృజనాత్మకతను వెలికి తీసి, ఎకో వైజాగ్ కు సంబంధించిన అంశాలను జోడిస్తూ అద్భుతమైన చిత్రాలను వేసి ఎకో వైజాగ్ అభివృద్ధికి సహకరించుటకు జనవరి 20వ తేదీలోగా ఉచితంగా పేర్లను నమోదు చేసుకొని ఈ మెగా ఆర్ట్ కాంటెస్ట్ నందు పాల్గొనాలని, పేర్లను నమోదు చేసుకునేందుకు సూచించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకోవచ్చని, వివరాల కొరకు జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా స్వచ్చంద సంస్థ ప్రతినిధులను 9000086861 / 8555058575 మొబైల్ నెంబర్ల నందు సంప్రదించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement