Saturday, April 27, 2024

AP: తరగని సంపద వేమన పద్యాలు….కడప కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప, జనవరి 19 (ప్రభన్యూస్): సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా తెలుగు భాషను సరళంగా వర్ణించిన ప్రజాకవి యోగి వేమన అని, ఆయన కూర్చిన ఆటవెలది పద్యాలు తెలుగు సాహితీ రంగంలో తరగని సంపద అని కడప జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు అభివర్ణించారు. కలెక్టరేట్ లోని స్పందన హాలులో యోగి వేమన జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… ఆటవెలది పద్యాల రూపంలో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే వాడుక భాషలో అద్భుతమైన కవిత్వాన్ని అందించిన ఘనత యోగివేమన సాహితీ ప్రత్యేకత అన్నారు. సామాజిక రుగ్మతలపై, సమాజ సంస్కరణకు కృషి చేసిన గొప్ప దార్శినికుడు వేమన అన్నారు. తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసి.. అరుదైన స్థానాన్ని పొందిన మహనీయుడని కొనియాడారు. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.


వేమన ప్రతి రంగాన్ని నిశితంగా పరిశీలించి నాటి సమాజంలో జరిగే అక్రమాలపై తనదైన శైలిలో నిర్భయంగా నిజాయితీగా వర్ణించారన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో సంతోషంగా ఉంటే ఉద్యోగ విషయాల్లో కూడా సంతోషంగా పనిచేయగలుగుతామని పేర్కొన్నారు. వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను పెంపొందించే కావ్యాలను.. యువత ఆదర్శంగా తీసుకొని నవ సమాజ సంస్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. అంతకుముందు యోగి వేమన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement