Sunday, May 12, 2024

Tirumala: ఆర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

తిరుమల (ప్రభన్యూస్) : నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా నవంబర్‌లో క‌ల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్ల‌డించింది. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేయ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు.

నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు. అయితే బ్రహ్మోత్సవం తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించ‌బోమ‌న్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దీనికి త‌గ్గ‌ట్టు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement