Tuesday, April 30, 2024

తక్కువ ధరకు టవెూటాలు.. రైతుబజార్లలో విక్రయించనున్న మార్కెటింగ్‌ శాఖ..

అమరావతి, ఆంధ్రప్రభ: కొండెక్కిన టమోటా ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుతం ప్రయత్నాలు ప్రారంభించింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతుల వద్ద నేరుగా టమోటాలను కొనుగోలు చేసి రైతు బజార్లలో తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఈనెల 20 శుక్రవారం నుంచే రైతు బజార్లలో తక్కువ ధరకు టమోటాలను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖా మంత్రి తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి టమోటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు..ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో టమోటా ధరలను నియంత్రించేందుకు ప్రభుతమే స్వయంగా రంగంలోకి దిగింది..ఇతర రాష్ట్రాల్ర నుంచి టమోటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్టు కాకాని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓలకు కు కూడా ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement