Wednesday, May 8, 2024

AP | రబీ వరికి ఏదీ ప్రత్యామ్నాయం.. వేరుశెనగ, మొక్కజొన్నపై దృష్టి

అమరావతి, ఆంధ్రప్రభ : రబీ సీజన్‌లో వరి స్థానంలో లాభదాయకత ఎక్కువ ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి వనరులు అందుబాటు-లో ఉన్నపుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నేలల స్వభావాలను బట్టి ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే దిగుబడులు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి నూనె గింజల సాగుపై రైతులు దృష్టి కేంద్రీకరించాలి.

ఈ మేరకు వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ యూనివర్శిటీల్లోని శావేత్తలు వరికి ప్రత్యామ్నాయంగా పండించే పంటలనూ, సాగు విధానాన్నీ, అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల వంగడాలను సూచిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ కేంద్రం వేరుశెనగ సాగుకు సంబంధించి రైతులకు ప్రత్యేక సూచనలు అందిస్తోంది.

వేరుశెనగ సాగులో కేవలం 122 రోజుల పంట కాలంలో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి నిచ్చే కదిరి లేపాక్షి (కె.182) వంగడం బెట్ట, తెగుళ్లను బాగా తట్టుకుని నిలబడుతున్నట్టు గుర్తించారు. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్‌, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి తదితర వంగడాలను కూడా నేల స్వభావాన్ని బట్టి వినియోగించాల్సి ఉంటుంది.

- Advertisement -

రబీలో మొక్కజొన్న సాగుకు కూడా సూచనలు అందిస్తున్నారు. మొక్కజొన్నను రానున్న మూడు నెలల కాలంలో వచ్చే ఏడాది జనవరి 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది.. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండాలి.

సయాట్రినిప్రోల్‌, థయోమిథాక్సామ్‌ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేస్తే మొక్క తొలిదశలో వచ్చే పురుగులను నివారించవచ్చని శాసవేత్తలు సూచిస్తున్నారు. రబీ సీజన్‌ లో అనుకూల సాగుగా ఉన్న జొన్నకు సంబంధించి నేల స్వభావాలు, పంట కాల పరిమితి ఆధారంగా ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్‌ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్‌ఎం 35-1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 వంగడాలను సూచిస్తున్నారు.

హైబ్రిడ్‌ రకాలైన సీఎస్హెచ్‌ 15, ఆర్సీఎస్హెచ్‌ 16, సీఎస్హెచ్‌ 19, సీఎస్హెచ్‌ 31 ఆర్‌ వంగడాలు విత్తుకోవటానికి వాతావరణం ఇపుడు అనుకూలంగా ఉంది. దీనిపై రైతులు పూర్తిస్థాయి అవగాహన, సాగులో పాటించాల్సిన మెళుకువల గురించి తెలుసుకునేందుకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను సం
పదించాల్సి ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement