Saturday, April 27, 2024

తెలుగు రాష్ట్రాల విభజన హామీల‌పై విచార‌ణ జ‌న‌వ‌రి రెండ‌వ వారానికి వాయిదా..

ఏపీ – తెలంగాణ విడిపోయేటప్పుడు లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అప్పటి అధికార యూపీఏ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వేసులుబాటులు కల్పిస్తామని హామీలు ఇచ్చింది. అందులో ప్రధానమైనవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటివి ముఖ్యమైనవి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం విధిత‌మే.

అయితే ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన అనంతరం తమకు దక్కాల్సిన ప్రయోజనాలని రక్షించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ప్రతివాదులకు ముందుగానే పిటిషన్ కాపీలు అందించాలని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదికి ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణని జనవరి రెండవ వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement