Friday, May 3, 2024

తిరుపతి రుయాలో క్షతగాత్రుల ఆర్తనాదాలు.. తమవారికి ఏమైందోనని బెంగ..

శనివారం సాయంత్రం వరకు పేషెంట్లను చూసిన డాక్టర్లు, నర్సులు ఇక ఇబ్బందేమీ లేదని కాస్త రిలాక్స్ అవుతున్న వేళ.. అర్ధరాత్రి పిడుగులాంటి వార్త తెలిసింది. బాకారాపేట సమీపంలోని ఘాట్​లో పెళ్లి బస్సు బోల్తా పడిందని తెలుసుకుని వెంటనే అలర్ట్​ అయ్యారు. రెండు మూడు అంబులెన్స్​లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే విషయం తెలిసిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు. తాళ్లతో లోయలోకి దిగి.. క్షతగాత్రులను చేతులపై ఎత్తుకుని పైకి తీసుకొచ్చి అంబులెన్స్​లో హాస్పిటల్​కు పంపిస్తున్నారు. ఒంటిగంట సమయానికి రుయా ఆస్పత్రికి 43మంది క్షతగాత్రులను తీసుకొచ్చారు.

ఇక.. రుయా ఆస్పత్రి వద్ద ఒకటే అరుపులు, గోలలు.. కాళ్లు విరిగి ఒకరు.. చేయి విరిగిన వారు మరొకరు.. దాదాపు పదుల సంఖ్యలో బస్సు ప్రమాద బాధితులు అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారికి ట్రీట్​మెంట్​ చేస్తుంటే, టించర్​ వేసి కట్టుకడుతుంటే.. గాయాలకు కుట్లు వేస్తుంటే ఆ బాధను తట్టుకోలేక ఏడ్వడం కనిపించింది. బస్సు ప్రమాదంలో తమ వారికి ఏమైందో అన్న బెంగ మరోవైపు వారిని మరింత కలిచి వేసింది. శనివారం రాత్రి రుయా ఆస్పత్రి వద్ద కనిపించి ఈ బీతావహ దృశ్యం చూసి చాలామంది కన్నీరుపెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement