Thursday, May 16, 2024

మద్ధతు ధరకు నిధుల కొరత లేదు.. అవసరమైతే జోక్యం చేసుకుంటాం : కేంద్రం

రైతుల పంటలకు మద్దతు ధరల విషయంలో నిధులకు ఎలాంటి కొరతా లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1700 కోట్ల కేంద్ర బకాయిలపై మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ పథకానికి 62 శాతం నిధులు తగ్గించారని, రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో దేశంలోని రైతులకు ధరల విషయంలో ఎలా న్యాయం చేస్తారు, ఈ పథకాన్ని ఎత్తివేయాలని భావిస్తున్నారా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు 1700 కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం పెండింగ్‌లో ఉంచిందని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అందజేసినా బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని మిథున్‌ రెడ్డి అడిగారు. రైతులకు ఇచ్చే స#హకారం ఇదేనా? ఎప్పటిలోగా ఈ బకాయిలు అందజేస్తారని ప్రశ్నించగా… ధరల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు అవసరమైతే మార్కెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement