Monday, April 29, 2024

Telugudesam – స్పీడ్ పెంచిన నారా భువ‌నేశ్వ‌రి…నేత‌లు, కార్య‌కర్త‌ల‌తో మమేక‌మ‌వుతున్న చంద్ర‌బాబు స‌తీమ‌ణి…

రాజమండ్రి: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కావ‌డంతో ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి రాజ‌కీయాల‌లో యాక్టీవ్ అయ్యారు.. జైలులో ఉన్న భ‌ర్త‌ను క‌లుస్తూ, ఆయ‌న స‌ల‌హాలు,సూచ‌న‌ల‌కు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు.. ఒక వైపు భ‌ర్త విడుద‌ల కావాల‌ని కోరుతూ, ఆల‌యాలు, చ‌ర్చిల‌లో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు , పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.. అలాగే చంద్ర‌బాబు అరెస్ట్ కు నిర‌స‌న‌గా వివిధ ప్రాంతాల‌లో జ‌రుగుతున్న దీక్ష శిబిరాల‌ను ఆమె సంద‌ర్శిస్తూ, అక్క‌డి నేత‌ల‌కు ,కార్య‌క‌ర్త‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నారు.. అలాగే రాజ‌మండ్రి లోని టిడిపి నేత వాసు ఇంటిని తాత్కాలిక క్యాంప్ కార్యాల‌యంగా టిడిపి మార్చ‌డంతో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులంతా అక్క‌డే ఉంటున్నారు.. ఒక వైపు భ‌ర్త‌కు అల్పాహారం, భోజన స్వ‌యంగా చేసి జైలుకు పంపుతున్నారు భువ‌నేశ్వ‌రీ.. అదే స‌మ‌యంలో క్యాంప్ ఆఫీస్ వ‌స్తున్న టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అప్యాయంగా ప‌ల‌కరిస్తూ అంద‌రికీ ధైర్యాన్ని ఇస్తున్నారు.. ఇంత‌కాలం గృహిణిగా, హెరిటేజ్ కంపెనీ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హారాలు చూస్తున్న భువ‌నేశ్వ‌రి తొలిసారిగా రాజ‌కీయ క్షేత్రంలో అడుగుపెట్టారు..

ఇది ఇలా ఉంటే . చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు . దీక్షా శిబిరం వద్దకు భువనేశ్వరి వెళ్లి వారికి సంఘీబావం ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏం తప్పు చేశారని జైలులో నిర్బంధించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? ఇప్పటివరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు’’ అని భువనేశ్వరి అన్నారు. ఏ తప్పూ చేయలేదని ప్రజలందరికీ తెలుసని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement