Thursday, May 16, 2024

TDP – నందికొట్కూరులో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న … టిడిపి శ్రేణులు ఘ‌న స్వాగ‌తం…ఫోటో గ్యాలరీతో..

కర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు కోసం హైద‌రాబాద్ బేగంపేట నుంచి ఓర్వకల్లు కు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు విమానంలో చేరుకున్నారు..అక్క‌డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ వద్ద చంద్రబాబుకు టిడిపి శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం, యుద్దభేరి కార్యక్రమం లో భాగం గా ఉమ్మడి కర్నూల్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్శించ‌నున్నారు. కాగా, కర్నూలు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా నందికొట్కూరు కు చేరుకున్నారు..అక్క‌డి నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పటేల్ కూడలి వరకు రోడ్ షో నిర్వ‌హించారు..చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే అడుగు అడుగు ఫ్లెక్సీలతో కేజీ రోడ్డు..పసుపు రంగంగా మార్చేశారు. బ‌హిరంగ‌స‌భ అనంత‌రం ఆయ‌న బ‌న‌క‌చ‌ర్ల‌కు వెళ్ల‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement