Thursday, May 9, 2024

విశాఖకు తలమానికం క్రూయిజ్ టెర్మినల్ ప్రాజెక్టు అతి త్వరలో ప్రారంభం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ నగరానికి తలమానికంగా భావిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రూయిజ్ టెర్మినల్ ప్రాజెక్టు 2023కల్లా ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 2000 చదరపు మీటర్ల వైశాల్యంతో 96 కోట్ల రూపాయల అంచనాతో సుమారు 50 వేల నుంచి లక్ష వరకు సామర్థ్యం కలిగిన గ్రాస్ రిజిస్టర్ టన్నేజి కంటైనర్ల సామర్థ్యంతో విశాఖలో క్రూజ్ టెర్మినల్‌ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఇప్పటికే టూరిజంలో ప్రపంచంలోనే తొలి పది పర్యాటక ప్రదేశాలలో స్థానం సంపాదించవలసిన విశాఖపట్నం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంతో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో ప్రారంభించబోతున్న క్రూయిజ్ టెర్మినల్ ఆ ఘనతను సాధించే అవకాశం ఉందని తెలిపారు. విశాఖను త్వరలోనే ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో మొదటి వరుసలో నిలపగలమని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను మరింత చొరవ తీసుకొని వీలైనంత త్వరగా క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement