Monday, April 29, 2024

Big story : ముంచుకువస్తున్న మరో ఆర్థిక ముప్పు.. చైనా-తైవాన్‌ మధ్య ఉద్రిక్తత

అంతర్జాతీయంగా అనేక వరస సంఘటనలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇక్కిబిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తైవాన్‌ రూపంలో మరో సమస్య దూసుకు వస్తోందని ఆర్ధిక నిపుణులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా, ఇంథన కొరత, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు, ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభం వంటి పరిణామాలతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

అమెరికా చర్యతో సమస్య
తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా పలు మార్లు అమెరికాను కోరింది. తైవాన్‌ నాయకత్వాన్ని రెచ్చగొడుతున్న అమెరికా చైనాతో కయ్యానికి కాలుదువుతోంది. ఈ నేపధ్యంలోనే అమెరికా చట్టసభల స్పీకర్‌ తైవాన్‌లో పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది తమ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకోవడమేనని ఆగ్రహ ం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో చైనా తైవాన్‌పై చర్యకు దిగితే సమస్య అంత్యంత జఠిలంగా మారుతుందని, ఇది 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంధ్యం పరిస్థితులను మళ్లిd తీసుకు వచ్చేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇది ఉక్రెయిన్‌, రష్యా సమస్య కంటే పది రేట్లు ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.

జలరవాణాపై ప్రభావం
రష్యా, ఉక్రెయిన్‌ తరహాలోనే చైనా-తైవాన్‌ వివాదం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితి కాదు. తైవాన్‌పై చైనా చర్యకు దిగితే వెంటనే అమెరికా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు రెండు అగ్రదేశాల మధ్య వివాదంగా అది మారుతుంది. అమెరికాకు జపాన్‌ కూడా మద్దతు పలికితే అది మరింత
తీవ్రరూపం తీసుకుంటుంది. చైనా క్షిపణి దాడులు చేస్తే సముద్ర మార్గం, గగనతలం కూడా ప్రమాదకరంగా మారాతాయి. దీని వల్ల జల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా సరఫరా వ్యవస్థల్లో మళ్లిd తీవ్రమైన అంతరాయాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాడి చేస్తే ఆర్థిక ఆంక్షలు
తైవాన్‌ పై చైనా దాడి చేస్తే అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. చైనా ఇంధన దిగుమతులను నిషేధించే అవకాశం ఉంటుంది. అమెరికా మిత్ర దేశాలు సైతం ఆర్థిక ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది. ఇప్పటికే రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాల ఆంక్షలతో చాలా దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. చైనాపై కూడా ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను తలక్రిందులు చేస్తుంది. ఈ వివాదం సూదీర్ఘకాలం కొనసాగితే అమెరికా జీడీపీలో 10 శాతం వరకు, చైనా జీడీపీలో 35 శాతం వరకు కోతపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తైవాన్‌లో చిప్‌ల తయారీ
ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్‌ వాటా 30 శాతానికి పైగా ఉంది. అత్యాధునిక సెమీకండక్టర్లను తైవాన్‌ తయారు చేస్తోంది. ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీలకు సెమీకండక్టర్లను తైవాన్‌ నుంచే సరఫరా అవుతున్నాయి. చైనాలోనూ ఇవి భారీగా తయారువుతున్నాయి. యుద్ధం వస్తే ఇక్కడి నుంచి చిప్‌ల తయారీ, సరఫరా నిలిచి ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ప్రపంచ వ్యప్తంగా టెక్నాలజీ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొక తప్పదు.

- Advertisement -

చాలా దేశాలపై ప్రభావం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనాలో తయారీ వస్తువుల పాత్ర గణనీయంగా ఉంది. చైనా పై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంటుంది. చివరకు అమెరికా, దాని మిత్ర దేశాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చైనాకు చిక్కులు తప్పవు. మన దేశంతో పాటు, అనేక ఐరోపా దేశాలు కూడా చైనాపై ఎంతగా ఆధారపడ్డాయో కరోనా సమయంలో వెల్లడైంది. అమెరికా మిత్రపక్షమైన జపాన్‌ను కూడా చైనా టార్గెట్‌ చేసుకుంటే మాత్రం ప్రపంచ ఆర్థిక మాంధ్యం అనివార్యంకానుంది.

అందరికీ నష్టమే
చైనా, తైవాన్‌ వివాదం ముదిరి యుద్ధానికి దారిస్తే అందరికీ నష్టమే. చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు సమస్యలు ఎదుర్కొంటాయి. చైనా జీడీపీలో ఎగుమతుల వాటా గణనీయంగా ఉంది. చైనా ప్రధానంగా చమురు, ఆహార పదార్ధాలను దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం, ఆంక్షలు వస్తే చైనాకు దిగుమతులు నిలిచిపోతాయి. అలాగే చైనా నుంచి భారీ స్థాయిలో జరిగే ఎగుమతులు నిలిచిపోయో ప్రమాదం ఉంది. చైనా నుంచి విద్యుత్‌ కార్లను అమెరికా భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఆంక్షలు పెడితే చైనాతో పాటు, అమెరికాకు అంతే స్థాయిలో నష్టం జరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యం ముంగిట ఉంది. యుద్ధం వస్తే అమెరికా ఆయుధాలకు డిమాండ్‌ ఏర్పడుతుంది. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొలుకుంటుంది. అదే సమయంలో అమెరికా రగిల్చే ఈ చిచ్చు వల్ల మన దేశంతో పాటు అనేక దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియాపై పూర్తి పట్టుకోసమే తైవాన్‌ విషయంలో చైనాను అమెరికా రె చ్చగొడుతోందని భావిస్తున్నారు.

మన దేశానికి ఇబ్బందే
మన దేశం తైవాన్‌తో ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు కలిగి లేదు. రెండు దేశాల మధ్య స్నేహం మాత్రం ఉంది. మన దేశంలో సెమికండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు తైవాన్‌ సహకారం ఎంతో అవసరం. మన దేశం నేరుగా తైవాన్‌కు ఈ విషయంలో మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలోని ఫార్మా కంపెనీలు పూర్తిగా చైనాపై ఆధారపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. అనేక వాణిజ్య ఒప్పందాలు, సహకార ఒప్పందాలు ఉన్నాయి. పైగా మన దేశానికి తైవాన్‌కు దౌత్య సంబంధాలు కూడా లేవు. అందువల్ల ఈ వివాదంలో మన దేశం అమెరికా వైఖరిని సమర్దించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌, రష్యా వివాదంలోనూ మన దేశం అమెరికాను సమర్ధించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement