Friday, September 22, 2023

చంద్ర బాబు అరెస్ట్ కు నిరసనలు – బలవంతంగా విద్యా సంస్థలను బంద్ చేయించిన పోలీసులు

విజయవాడలోని వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసన చేస్తారేమోనన్న ఉద్దేశంతో పోలీసులు కళాశాలలను బలవంతంగా ఖాళీ చేయించారు..నగరంలోని సిద్దార్థ, పీవీపీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లారు. తరగతులు సస్పెండ్‌ చేయించి కళాశాలలకు సెలవు ఇప్పించారు. కళాశాలలో ఎవరూ ఉండకూడదంటూ విద్యార్థులను బయటకి పంపించారు.చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని విద్యార్థులు వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పెట్టుకున్నారు. మద్దతిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

- Advertisement -
   

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విధంగానే తమ కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా ముందస్తు కట్టడి చర్యలు తీసుకున్నారు. కళాశాలల్లో భారీగా మోహరించి, బలవంతంగా తరగతులను రద్దు చేయించారు.అంతేకాకుండా కళాశాలలకు సెలవు ఇప్పించాలని యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చదువుకోనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement