Thursday, May 2, 2024

స్టీల్ ప్లాంట్ క‌థ మ‌ళ్లీ మొద‌టికి … ప్రైవేటీక‌ర‌ణ ఆపేదిలేదంటూ కేంద్రం ప్ర‌క‌ట‌న‌..

విశాఖ‌ప‌ట్నం – స‌రిగ్గా 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌లేదు…అంత‌లోనే కేంద్రం మాట త‌ప్పింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తామంటూ కేంద్రం తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ నిలిపివేస్తున్నామ‌ని ఉక్కు గ‌నుల స‌హాయ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఊపిరి పీల్చుకున్న ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ ఊపిరి ఆగిపోయే విష‌యాన్ని ప్ర‌స్తావించింది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. ‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోలేదు. ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ప్రకటనలో తెలిపింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని చెప్పింది…


కాగా, విశాఖ‌లో గురువారం ఉదయం ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని భావించడం లేదని, ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌ ను బలోపేతం చేసేరు. అయితే గురువారం మధ్యాహ్నం స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం యూనియన్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి ప్రకటనలు మారిపోయింది.. కార్మిక‌ నేతలు ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో అది త‌న చేతుల్లో లేద‌ని అప్పుడే తేల్చేశారు..అప్ప‌డు కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న‌లో ప‌స‌లేద‌ని తేలిపోయింది.. ఇటువంటి రెండు నాల్క‌ల కేంద్ర దోర‌ణి ప‌ట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేత‌లు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకు రావాలని అంటున్న‌కేంద్ర‌మే అసలు స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి రానీయకుండా అడ్డుకుంటు-న్నది నేత‌లు అన్నారు. ఖాయిలా పడిన పరిశ్రమగా చిత్రీకరించి మూసివేసేందుకు కేంద్రం మొదటి నుంచి కుట్ర చేస్తుందని జేఏసీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మండిపడ్డారు. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగనివ్వకుండా కావాలని ప్లాంట్‌ను ఆర్ధికంగా దెబ్బతీస్తోందన్నారు. బ్లాస్ట్‌ ఫర్నీస్‌ను మూసివేసిందని, ముడిసరుకు, వర్కింగ్‌ కేపిటల్‌ ఇవ్వడం లేదన్నారు. రైల్వే రేక్స్‌ను అడ్డుకుంటోందని, సొంతగనులు ఇవ్వడం లేదన్నారు. మరి లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ప్రశ్నించారు. దేశంలోని ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లకు కేటాయించినట్లు- వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించి, దీనిని పూర్తిస్థాయి సామర్ధంతో కేంద్రం నడవనిస్తే ఖచ్చితంగా స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాట పడుతుందన్నారు. కానీ ఆ దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని లేద‌ని అంటున్నారు..స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌ని కార్మిక‌సంఘాలు ప్ర‌క‌టించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement