Friday, May 3, 2024

రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌.. ఫిబ్రవరి 1నుంచి మూడు రోజులు

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యార్దుల్లో క్రీడాస్పూర్తిని పెంచేందుకు మూడు రోజుల పాటు ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆమె వివరాలను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించనున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇది 25వ మీట్‌ కానుందని తెలిపారు.

ఇప్పటికే పూర్వపు జిల్లాల స్దాయిలో ప్రాంతీయ స్టోర్ట్స్‌ మీట్‌ లు పూర్తికాగా, అక్కడ ప్రధమ, ద్వితీయ స్దానాలు దక్కించుకున్న వారు రాష్ట్ర స్ధాయికి అర్హత సాధించారని నాగరాణి తెలిపారు. తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి హాజరు కానున్నారన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు పద్మారావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జెఎస్‌ఎన్‌ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి విజయ భాస్కర్‌, శిక్షణ, ఉపాధి అధికారి డాక్టర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement