Saturday, May 4, 2024

Cricket | న్యూజిలాండ్​తో టీ20.. టాస్​ గెలిచి బౌలింగ్​ తీసుకున్న టీమిండియా!

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్‌లో భాగంగా టాస్‌ గెలిచిన టీమిండియా జట్టు​ బౌలింగ్​ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్​ హార్దిక్​పాండ్యా మాట్లాడుతూ.. తమకు తెలిసిన అత్యుత్తమ క్రికెట్‌ను ఆడడమే జట్టు లక్ష్యం అని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించడంతో పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నారు. జార్ఖండ్​ రాజధాని రాంచీలో మ్యాచ్​ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

శీతాకాలం సీజన్​లో మంచు ఎక్కువగా ఉంటుందని, అందుకే మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నానని కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా చెప్పారు.  టీ20లకు ముందు వన్డేలు ఆడడం ఆటగాళ్లలో మంచి ఆటతీరును కనబరిచేందుకు సహాయపడుతుందని పాండ్యా అన్నారు. పృథ్వీ షా కంటే ముందు ఇషాన్ కిషన్ రాంచీలో మ్యాచ్ ఆడతాడని చెప్పారు. ఇక.. ఈ మ్యాచ్​లో యుజ్వేంద్ర చాహల్ కూడా తప్పుకున్నాడని వెల్లడించారు.

భారత్​, న్యూజిలాండ్​ జట్ల వివరాలు:

భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

- Advertisement -

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(సి), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

Advertisement

తాజా వార్తలు

Advertisement