Friday, May 3, 2024

వేద మంత్ర పఠనంతో శోభిల్లుతున్నశ్రీశైలం.. గజవాహన సేవలో ఆది దంప‌తులు

కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో: శ్రీ‌శైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఆది దంపతులు గజవాహన సేవలో ఊరేగారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటం, చెక్కభజన, రాజభటులు వేషాలు, జాంజ్ పథక్ , జానపద పగటి వేషాలు , గొరవనృత్యం , బుట్టబొమ్మలు , తప్పెటచిందు బీరప్పడోలు , చెంచునృత్యం , నందికోలసేవ , ఢమరుకం , చితడలు , శంఖం , పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలు ఆక‌ట్టుకున్నాయి. రథ శిఖర కలశానికి పూజాదికాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 2 వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు . ఈ సందర్భంగా సోమవారం రథ శిఖర కలశానికి ఆలయములో పూజ‌లు నిర్వ‌హించారు.

వేదమంత్రాలతో పూజలు
న‌వాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వ‌హించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు చేశారు. యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అనంతరం జపాలు, పారాయణలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం వంటి పూజ‌ల‌ను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement