Wednesday, May 1, 2024

AP: చిత్రకారుడు పాపయ్య, గురునాధరావు విగ్రహాల ఆవిష్కరణ..

కశింకోట: తెలుగు చిత్ర కళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా కనుమరుగైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య అని ఆయన చిత్రాలు చూడని, పేరు వినని కళాభిమాని లేడంటే అతిశయోక్తి కాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాప్ సమీపంలో ప్రముఖ చిత్ర కళాకారుడు వడ్డాది పాపయ్య, దివంగత మాజీమంత్రి గుడివాడ గురునాధరావు విగ్రహాలను మంత్రి అమర్నాథ్, ఎంపీ డాక్టర్ సత్యవతిలు ఆవిష్కరించారు.

ఈ సంద్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ… వడ్డాది పాపయ్య చిత్రాలెన్నో కళాభిమానుల ఇళ్లల్లో భద్రపరచబడి ఉన్నాయన్నారు. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్ప వాడో, వ్యక్తిగా అంత నిరాడంబరుడు. సాదా సీదా తెల్ల పంచె అదే రంగు లాల్చీ ధరించి, సిసలైన తెలుగు వ్యక్తిలా వుండే వారని అందరూ చెబుతూ ఉంటారని చెప్పారు. మా తండ్రి గుడివాడ గురునాధరావు ప్రాంతానికి సుపరిచితులని మంత్రి అమర్నాథ్ అన్నారు. జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు తన సొంత నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. చిత్రకారుడు పాపయ్య వేసిన బొమ్మలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. దివంగత మాజీమంత్రి గుడివాడ గురునాథరావు నిస్వార్ధంగా ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఇటువంటి వారు విగ్రహాలను కసింకోట మండల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. జడ్.తుని గ్రామంలో గ్రామ సచివాలయం, పశువుల ఆసుపత్రి, రోడ్లు కాలువలను మంత్రి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ మలసాల భరత్ కుమార్, రాష్ట్ర వాటర్ వేస్ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, మండల ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మండల వైసీపీ అధ్యక్షులు మలసాల కిషోర్, అనకాపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జనకరామరాజు, జాజుల రమేష్, గ్రామ సర్పంచ్ మంత్రి జయ రజనీ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement