Saturday, May 4, 2024

AP: శ్రీముఖలింగ క్షేత్రంలో చక్రతీర్ధ స్నానాలు..

శ్రీకాకుళం, మార్చి 11: ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో నిర్వహించే చక్ర తీర్థ స్నానాలకు సోమవారం లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. నదిలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ చక్రతీర్థ స్నానాలకు తరలివస్తారు.

ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీముఖలింగం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. స్నానాలకు నదిలో అవసరమైన నీటిని వంశధార ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం గొట్ట బ్యారేజ్ నుండి విడుదల చేశారు. ఈ నదిలో శ్రీముఖలింగ క్షేత్ర ఉత్సవ విగ్రహాలకు పుణ్యస్నానాలు నిర్వహించి, అనంతరం నందీశ్వరుడిపై ఊరేగింపు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement