Tuesday, April 30, 2024

tourism: కార్తీక మాసంలో స్పెషల్‌ సర్వీసులు.. ప్రత్యేకంగా మన్యం టూర్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: కార్తీక మాసంలో ఆర్టీసీ స్పెషల్స్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన నేపధ్యంలో మార్గశిర మాసంలో విశాఖ ఆర్టీసీ భక్తుల కోసం పంచ వైష్ణవ క్షేత్రాల దర్శనంతో ఒక రోజు ట్రిప్పు లు చేపడుతున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో ప్రజలకు మెరుగైన రవాణా అందించేందుకు ఆర్టీసీ ప్రత్యే క బస్సులు నడుపుతుంది. ఇందులో భాగంగా కార్తీక మాసంలో 1750 ప్రత్యేక సర్వీసులు నడప గా ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పంచ వైష్ణవ క్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పంచ వైష్ణవ క్షేత్రాల సందర్శనలో భాగంగా విశాఖ నుంచి ద్వారకా తిరుమల (శ్రీ వెంకటేశ్వరస్వామి) , అంతర్వేది (శ్రీ లక్ష్మీ నర సింహస్వామి). అప్పన్నపల్లి ( శ్రీ బాల బాలాజీ స్వామీ). ర్యాలీ (శ్రీ జగన్మోహినీ కేశవ స్వామీ), అన్నవరం( శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామీ) పుణ్య ప్రదేశాలకు బస్సులని తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కార్తీకం టూర్‌ అదుర్స్‌..
కార్తీక మాసంలో వివిధ వర్గాలు ఆధ్యాత్మిక స్వాంత నకు వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దీంతో శైవ ఆలయాలు కార్తీక శోభతో అల రారుతుంటాయి. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచు కొని ఈ ఏడాది కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఆయా ఆలయాల సంప్రదాయాలు, అవసరాలను దృష్టి లో ఉంచుకొని భక్తుల అవసరాలకు అనుగుణంగా సర్వీ సులు నడిపారు..ఇంకా నడుపుతున్నారు. పంచారామా లైన అమరావతి శ్రీ అమరాస్వరస్వామి, భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి, పాలకొల్లు శ్రీ క్షీర లింగేశ్వర స్వామీ, ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామీ, సామర్లకోట శ్రీ కుమా ర రామలింగేశ్వర స్వామీ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడిపారు. పూర్తి రద్దీతో నడిచిన బస్సులతో ఆర్టీసీకి ఆదా యం కూడా బాగానే వచ్చింది. ఇవే కాక రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి కూడా భక్తుల కోసం బస్సులు నిర్వహిస్తున్నారు.

పర్యాటక ప్రాంతాలు కూడా..
కార్తీక మాసంలో ఒక్క పుణ్యక్షేత్రాలకే కాక ఆర్టీసీ పర్యాటక ప్రాంతాలకు కూడా సర్వీసులను పెంచింది. వారాంతపు రోజుల్లో విశాఖపట్టణం నుంచి ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు వ్యాలీ, డముకు, గాలికొండ వ్యూ పాయింట్లు, చాపరాయి, పద్మాపురం గార్డెన్లు, ట్రైబల్‌ మ్యూజియం కలుపుతూ ప్రత్యేక బస్సులు నడుపుతు న్నారు. ఈ సర్వీసులకు సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆంధ్రా కశ్మీరం లంబసింగి, తాజంగి ఢ్యాం, కొత్తపల్లి జలపాతం, మోదమాంబ ఆల యం(పాడేరు), కాఫీ తోటల్లో సందర్శకులకు కనువిందు చేసేందుకు అధికారులు బస్సులను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా ధారామ్రట పేరిట శివాలయం, ధారామటం, జలపాతాలు, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జన కొండ(అనకాపల్లి) ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

మన్య దర్శిని..
తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య పుణ్యక్షేత్రాలకు అమలాపురం డిపో నుంచి మన్యసీమ దర్శిని పేరిట బస్సులు నడుపుతున్నారు. ర్యాలీ-మోహినీ అవతార కేశవస్వామీ, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి, సీతపల్లి బాపనమ్మ గుడి, రంప పురాతన శివాలయం, రాజమండ్రి పుష్కరాల రేవు, ఇస్కాను -టె-ంపుల్‌కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇదే సమయంలో కార్తీక వనసమా రాధన పేరిట మారేడుపల్లి కాఫీ, రబ్బరు తోటలు, ఔషధ మొక్కలు, జలతరంగిణి జలపాతం, మాములేరు వాగు ప్రాంతాలకు కూడా బస్సులు ఏర్పాటు- చేసారు.

ఏటా ప్రత్యేక బస్సులు..
కార్తీక మాసంలో ఏటా ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 2019-20లో 1634 నడపగా గతేడాది కోవిడ్‌ నేపధ్యంలో బస్సులు నడవలేదు. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ 1750 ప్రత్యేక సర్వీసులు నడిపింది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెరుగుదల నేపధ్యంలో వ్యక్తిగత ప్రయాణంతో పెరిగే ఖర్చును ఆర్టీసీ తగ్గిస్తుందని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని తక్కువ ఖర్చుతో కోరుకున్న పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement