Sunday, April 28, 2024

breaking: మెకానిక్ షాప్ లో షార్ట్ సర్క్యూట్.. దగ్ధమైన బైక్ లు.. వస్తువులు..

షార్ట్ సర్క్యూట్ కారణంగా మెకానిక్ షాప్ లో మంటలు చెలరేగిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక జొన్నవాడ సెంటర్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లోని ఓ మెకానిక్ షాప్ లో వేకువ జామున షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి‌. అటుగా వెళ్తున్న వారు షాపు నిర్వాహకులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు‌‌.

కాంప్లెక్స్ లోని ఇతర దుకాణాలకు మంటలు విస్తరిస్తుండటంతో దుకాణాలలోని వస్తువులను బయటపెట్టారు. మెకానిక్ షాప్ లోని వాహనాలు ఇతర వస్తువులను పూర్తిస్థాయిలో దగ్ధమవగా ఇతర దుకాణాల్లో నీ వస్తువులు పాక్షికంగా కాలిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement