Saturday, May 11, 2024

నేడు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వార్ కొన‌సాగుతూనే ఉంది. గుడివాడ‌ క్యాసినో వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల‌ను రంజుగా మార్చింది. టీడీపీ, వైసీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. అయితే ఈరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలవనున్నారు. గుడివాడలో జరిగిన క్యాసినోపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈరోజు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తో సమావేశమై తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించనుంది. గవర్నర్ క్యాసినో వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరనున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement