Monday, May 6, 2024

44.33 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం.. 8 మంది అరెస్టు

కడప, ప్రభ న్యూస్‌ బ్యూరో: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడున్న అంతర్‌ రాష్ట్ర ఎర్రచందం ముఠాను అరెస్టు చేసి, వారి నుండి రూ.44.33 లక్షలు విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలు, 5 సెల్‌ఫోన్లు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి హర్షవర్థన్‌ రాజు శనివారం విలేకరులకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచామన్నారు. అందిన సమాచారం మేరకు రాయచోటి డి.ఎస్పీ పి శ్రీధర్‌, వాయల్పాడు సి.ఐ బి.ఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు కలికి మండలం గుట్టపాలెం బస్సు స్టాఫ్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారన్నారు.

కలికిరి వైపు నుండి ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌, ఇన్నోవా వాహనాలు అనుమానం కలిగించే విధంగా అతివేగంగా రాగా , వాటిని ఆపే ప్రయత్నం చేశామన్నారు. అయితే ఆ వాహనంలో వున్న వారు వాహనాలను ఆపకుండా పోలీసులపై దాడికి యత్నించారన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తమిళనాడు రాష్ట్రంలో వేలూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన విజయ కుమార్‌ జయందన్‌, రాజేంద్రన్‌, అప్పస్వామి, రాజి రంగనాథన్‌, సి సేటు, ముత్తు రామరాజు, నటరాజ్‌ మంజునాథ మురగన్‌ సూర్యలను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి 50 కిలోలు అంటే.. దాదాపు 44.33 లక్షలు విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలు, రూ.10 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారు, పల్సర్‌ వాహనం, 5 సెల్‌ ఫోన్లు, రూ.700లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement