Thursday, May 2, 2024

Jyotiraditya Scindia : రాజమండ్రిని మ‌హాన‌గరం గా తీర్చిదిద్దుతా….. కేంద్ర‌మంత్రి జ్యోతి రాథిత్య సింధియా

రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతి రాథిత్య సింధియా తెలిపారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మోడ్రన్ టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో నిర్మాణం జరుగుతుందన్నారు. కనివిని ఎరుగని రీతిలో ఇక్కడ టర్మినల్​ను నిర్మిస్తామని చెప్పారు. టర్మినల్ నిర్మాణం తొందరలో పూర్తైతే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలో 10 నగరాలకు విమానాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇక్కడ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అని కొనియాడారు. తెలుగు భాష చాలా అందమైన భాష, తెలుగు లిపి కూడా అద్భుతంగా ఉంటుందన్నారు. ఇది ఆది కవి నన్నయ్య పుట్టిన ప్రాంతమని తెలిపారు. అఖండ గోదావరి ఉన్న అద్భుతమైన నేల ఇది అన్నారు. ఇక్కడ ప్రజలు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పుట్టుకొచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ మట్టికి, నేలకు, గోదావరికి సలాం చేస్తున్నానని తెలిపారు. కోటిలింగాల రేవు, మారేడుమిల్లి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement