Saturday, May 4, 2024

Monsonn | నాలుగు రోజులు వర్షాలే.. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. రుతుపవనాలు బలపడటంతో ఇప్పటికే పలు జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 60.75 మిమీ వర్షపాతం నమోదైంది. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో జోరువానలు కురిశాయి.

సగటు సముద్ర మట్టం వద్ద గల ఋతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్‌, నార్నాల్‌, శివపురి, మాండ్లా, అంబికాపూర్‌, చంద్బాలి మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఒడిశా తీరము వద్ద గల ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుoదని, రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు.

జిల్లాల వారీ వర్షాలు ఇలా

  • బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
  • గురువారం (20వ తేదీ) శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
  • శుక్రవారం (21వ తేదీ) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
    శనివారం (22వ తేదీ) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వైఎస్‌ఆర్‌, అనంతపురం, కర్నూలు , నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది
Advertisement

తాజా వార్తలు

Advertisement