Monday, May 6, 2024

PV NarasimhaRao – 61 ఏళ్ల త‌ర్వాత తెలుగు తేజానికి ‘భార‌త ర‌త్న’ …

హైద‌రాబాద్ – బార‌త‌దేశాన్ని ప్ర‌గ‌తిప‌థం వైపు అడుగువేసేందుకు బ‌ల‌మైన పునాధులు వేసి మౌన‌ముని, రాజ‌కీయ దురంధురుడు, ప్ర‌గ‌తి శీల‌కుడు పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహ‌రావుకు భార‌త ర‌త్న పుర‌స్కారం ల‌భించింది.. 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించ‌డం విశేషం… 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్‌‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం. ఎప్పుడో లభించాల్సి ఉన్నా…ఇప్పుటికైన బ‌హుబాష కోవిదుడు, ఆధునిక భార‌త్ కు బాట‌లు ప‌రిచిన నేత‌కు ఇప్పటికైన అత్య‌న్న‌త పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.. ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల పివి కుటుంబ స‌భ్యులు ప్ర‌ధాని మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు…

పీవీ ప్రస్థానం..
పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్ధానం.
1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్‌ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. పీవీని ప్రధాని పదవి అనుకోకుండా వరించింది.

ఊహించ‌ని విధంగా ద‌క్కిన ప్ర‌ధాని ప‌ద‌వి..

1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడు అంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. .

- Advertisement -

బ‌హుబాష‌ల‌లో ర‌చ‌నా వ్యాసంగం ..

రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా పీవీ తన రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’కు హిందీ అనువాదం రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో తెలుగు అనువాదం చేసారు. అనేక వ్యాసాలు రాసారు. పీవీ నర్సింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. 1970, జూలై 1 న ఆమె కన్నుమూసారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఉండేదట పీవీకి. అది నెరవేరకుండానే 2004, డిసెంబర్ 23న పీవీ కన్నుమూసారు. ఆయన స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు ‘పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరుపెట్టారు. తాజాగా కేంద్రం దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపిక చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement