Tuesday, May 7, 2024

అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అడబిడ్డలపై జరుగుతున్న ఘోరాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలవుతున్న శిక్షలే కాకుండా అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయపడ్డారు. జూబ్లిdహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఆయన స్పందిస్తూ, పాతబస్తీ బాధితురాలిని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తరచూ ఈ తరహా ఘోరాలు జరుగుతున్నానయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల శంషాబాద్‌ పరిసరాల్లో జరిగిన దిశ హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన పదిహేడేళ్ళ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తన మనస్సును ఎంతో కలిచివేసిందన తెలిపారు. కొందరు మైనర్‌ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడటం మాటలకు అందని దుర్మార్గం అని తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకునే ఆడబిడ్డలపై పరులెవరైనా ఒక దెబ్బ వేస్తే తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురువుతారని ఆయన పేర్కొన్నారు.

అలాంటిది ఒక బాలికను సమూహమే చెరపడితే ఆ బాలికతో పాటు తల్లిదండ్రులు ఎంతో క్షోభకు గురవుతారో తాను ఊహించగలని ఆయన వెల్లడించారు. ఇటువంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనదన్నారు. ఈ కేసులో పోలీసులు పరిశోధన చరుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా పరిశోధన ముందుకు సాగాలన్నారు. దోషులకు శిక్ష పడినంత మాత్రన బాధితురాలు న్యాయం జరుగుతుందని భావించకూడదని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. బాధితురాలు జీవితంలో నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చొరవ చూపాలని పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement