Sunday, May 19, 2024

నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు.. వాహనంతో పాటు ఖాళీ ప్యాకెట్లు సీజ్‌చేసిన పోలీసులు..

తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ నకిలీ పత్తి విత్తనాల రాకెట్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ, షాద్ నగర్ ఏసీపీ పర్యవేక్షణలో ఎస్వోటీ శంషాబాద్. షాద్ నగర్ పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. దీంతో పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. 633 ప్యాకెట్లు, 255.64 కేజీల న‌కిలీ విత్త‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఒక వాహ‌నం, ఖాళీ ప్యాకెట్లు, కెమిక‌ల్ పౌడ‌ర్‌ను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా, వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ ఆట‌క‌ట్టించారు పోలీసులు.

నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఫరూక్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ ఫిర్యాదుతో సమాచారాన్ని అందుకున్న ఎస్ఓటి శంషాబాద్‌, షాద్ నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేప‌ట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఏస్ వాహ‌నంలో గోనె సంచులున్న‌ ప్యాకెట్ లలో పత్తి విత్తనాలను గ‌మ‌నించారు. ఎలాంటి లాట్ నెంబర్, ఇన్ వాయిస్, అనుమతులు లేకుండా అక్రమ సరఫరా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీకి చెందిన పోలవరపు హరిబాబు (47) సీడ్ ఆర్గనైజర్ గా గుర్తించారు. ఎంతో కాలంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న‌ట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన‌ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement