Thursday, May 16, 2024

రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హాండ్‌ బాల్‌ పోటీలు..

కందుకూరు : ప్రకాశంజిల్లా కందుకూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి 6వ జూనియర్‌ బాలికల హాండ్‌ బాల్‌ పోటీలు ప్రారంభమైనాయి. టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 9 జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ఉత్తమ జట్లు ఈ పోటీలలో తలపడుతున్నాయి. ట్రాఫిక్‌ డియస్‌సి సురేంద్ర ఈ పోటీలను ప్రారంభించారు. వేడుకగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టిఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు, కందుకూరు పోలీసు సిఐ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement