Tuesday, June 11, 2024

ఏకగ్రీవమైన ఉలవపాడు ఉపసర్పంచ్

ఉలవపాడు : ఉలవపాడు మండలంలో ఉపసర్పంచ్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఉలవపాడు గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా బ్రహ్మయ్య నిర్వహించి ఉలవపాడు ఉపసర్పంచ్‌గా కె.కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆత్మకూరు ఉపసర్పంచ్‌గా బి.శ్రవంతిని ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారిగా శ్రీనివాసరావు నిర్వహించారు. మన్నేటికోట ఎన్నికల అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపసర్పంచ్‌ కె.ఎస్తేరురాణిని ఎన్నుకున్నట్లు ఎంపిడిఓ రవికుమార్‌ తెలిపారు. ఎన్నికైన ముగ్గురు ఉపసర్పంచులుగా ఎన్నికైనట్లు వీరికి ఎన్నికల అధికారులు ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు పంచాయితీ కార్యనిర్వహణాధికారిణి విజయమ్మ, ఉలవపాడు సర్పంచ్‌ మానికల నాగలక్ష్మి, మన్నేటికోట సర్పంచ్‌ బసవయ్యనాయుడు, పంచాయితీల కార్యనిర్వహణాధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement