Monday, June 24, 2024

Yemen | యెమెన్‌లో పడవ బోల్తా.. 49 మంది మృతి

యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారుల‌తో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 49 మంది చనిపోయారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపింది. సుమారు 260 మంది సోమాలిస్, ఇథియోపియన్లతో ప్రయాణిస్తున్న పడవ సోమవారం గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా ప్రయాణిస్తుండగా మునిగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 71 మందిని రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement