Monday, July 22, 2024

AP | తుంగభద్రకు జలకళ.. కర్ణాటకలో భారీ వర్షాలు

కర్నూలు బ్యూరో, ప్రభ న్యూస్ : వేసవి తాగునీటికి అల్లాడిన కర్నూలు జిల్లా ప్రజానీకం దాహార్తిని తీర్చటమే కాదు.. ఖరీఫ్‌ సాగుకూ భరోసా కల్పిస్తోంది. నైరూతీ రుతుపవనాల దూకుడుతో కర్ణాటకలో వర్షాలు దంచి కొడుతుంటే… ఇప్పుడిప్పుడే తుంగభద్ర కళ కళలాడుతోంది.

రుతుపవనాల కారణంగా ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయం ఎగువ ప్రాంతాలు అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు చేరుతోంది.

ఈ రెండు నదుల కలయికతో ఏర్పడిన తుంగభద్రలో వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుండంతో తుంగభద్ర జలాశయానికి జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి పరిస్థితిని పరిశీలిస్తే సోమవారం నాటికి గడచిన 24 గంటల్లో ఇన్‌ ఫ్లో 4024 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో కేవలం 8 క్యూసెక్కులే నమోదైంది.

గత ఏడాదితో పోల్చితే నీటి మట్టం ఒక అడుగు తక్కువ గానే ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 1580 అడుగులు ఉంది. గత ఏడాది ఇదే రోజున 5.013 టీఎంసీలు ఉంటే.. ప్రస్తుతం 4.924 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3750 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మరో రెండు మూడు రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement