Sunday, May 5, 2024

పంట పొలంలో మాదక ద్రవ్యాలు

చిత్తూరు జిల్లాలో సాగవుతున్న గసగసాల పంటపై ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు చేశారు. మదనపల్లె మండలం దేవలంపల్లి వద్ద గసగసాలు సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. సుమారు ఎకరా పోలంలో గసగసాల పంట సాగవుతోంది. మాదక ద్రవ్యాలైన కోకైన్, హెరాయిన్,, బ్రౌన్ షుగర్ తయారీకి వీటిని వినియోగిస్తారు. మాదక ద్రవ్యాల తయారీకి వినియోగించే గసగసాల సాగుపై ఆంధ్ర ప్రదేశ్ లో నిషేధం వుంది.

దాడుల్లో భాగంగా సర్కారీ నిబంధనలను అతిక్రమించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గసగసాల సాగుకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో అనుమతిలేదని, నిబంధనలకు విరుద్ధంగా గసగసాలు సాగవుతున్నందునే దాడులు చేశామని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement