Wednesday, May 15, 2024

పోలవరం అంచనాలను ఆమోదించాలి.. డ్యాం సేఫ్టీ బిల్లుపై విజయసాయి ప్రసంగం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లుపై ఆయన ప్రసంగించారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందని, దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని  31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే రూ. 776 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వీటి ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయని చెప్పారు.

ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాం లు తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవని ఈ సందర్భంగా విజయసాయి వివరించారు. డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరమని, డ్యాంల రక్షణ చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. డ్యాంల నేషనల్ డేటాబేసు అందుబాటులో ఉంచాలని, దిగువ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని విజయసాయి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు రావలసిన న్యాయమైన జలాల వాటా దక్కడం లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు న్యాయం జరగాలంటే ఆంధ్రప్రదేశ్ జలాల్లో న్యాయమైన వాటా దక్కాలని ఆయన అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement