Sunday, May 12, 2024

Tirumala: శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నప్ర‌ధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం స్వామి వారిని దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ప్రధాని మోదీ కొద్దిసేపు ఆలయంలో గడిపారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి ప్రసాదం అందజేశారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోదీకి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిధిగృహం చేరుకున్నారు.2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement