Wednesday, May 1, 2024

స్థానిక ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు: పవన్

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా వినిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, పరిషత్, పంచాయతీ ఉపఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement