Tuesday, April 30, 2024

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి.. వారాహితో పవన్ సిద్ధం..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వాహన ట్రయల్ రన్ ను పవన్ కల్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేశారు పవన్. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ పవన్ చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement