Friday, February 3, 2023

జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు కుట్ర‌.. 25మంది అరెస్ట్

ప్ర‌భుత్వాని ప‌డ‌గొట్టేందుకు జ‌ర్మ‌నీలో కుట్ర‌కి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌తో 25మందిని అదుపులోకి తీసుకున్నారు. జ‌ర్మ‌నీలో ఇవాళ వివిధ ప్రాంతాల్లో త‌నిఖీలు జ‌రిగాయి. అతివాదులు, మాజీ సైనిక దిగ్గ‌జాలు ఈ కుట్ర ప‌న్నిన‌ట్లు భావిస్తున్నారు. పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని అతివాదులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్‌-13 ఈ ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భుత్వ కూల్చివేత‌కు కుట్ర చేసిన‌ బృందంలో సుమారు 50 మంది ఉన్న‌ట్లు భావిస్తున్నారు. రీచ్‌బ‌ర్జ‌ర్ తీవ్ర‌వాదులు ఈ ప‌న్నాగంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement