Friday, April 26, 2024

వ‌ర‌దలకు కుప్పకూలిన పాపాగ్ని బ్రిడ్జ్‌.. వీడియో ఇదిగో..

కడప జిల్లాలోని వెలిగ‌ల్లు జ‌లాశ‌యం నాలుగు గేట్లు ఎత్తివేశారు.. దాంతో వ‌ర‌ద నీరు ఉప్పొంగుతోంది. వరద ఉధృతితో పాపాగ్ని న‌ది వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహనాల‌ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement