Tuesday, May 14, 2024

One Side Victory – జ‌న‌సేన పొత్తుతో ఎపిలో టిడిపికి ఏక‌ప‌క్ష విజ‌య‌మే … నంద‌మూరి బాల‌కృష్ణ‌…

హిందూపురం – తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ అరాచకపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో గురువారం జరిగిన టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో నేరస్థులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని టీడీపీ, జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ప్రజలంతా బయటకు వచ్చి ఉద్యమించాలి అని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అని అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ యజ్ఞంలో తాను సైతం ఒక సమిధిగా ఉంటానని పవన్ కల్యాణ్ ముందుకు రావడం అభినందనీయం అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement