Sunday, January 19, 2025

Raja Singh: మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని సొంత పార్టీ నేతలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్ లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ త‌నకు చెప్పారన్నారు. ఈసారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇక్కడి నుండి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడ వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు మరిచిపోకండి అంటూ హెచ్చరించారు.

ఈ ఎన్నిక త‌నకు జీవన్మరణ సమస్య అని రాజాసింగ్ తెలిపారు. చావడానికి భయపడను చంపడానికి భయపడను అని రాజాసింగ్ సొంత పార్టీనేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సొంత వాళ్లే తన వ్యూహాలను ప్రత్యర్థులకు అప్పగిస్తున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 2018లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ప్రత్యర్థులతో ఎవరు టచ్‌లో ఉంటారో తనకు బాగా తెలుసని పేర్కొన్నాడు. తనకు ఎరవైనా నమ్మకద్రోహం చేయాలనుకుంటే ఆలోచించుకోండి అంటూ సీరియస్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement