Saturday, April 27, 2024

ఉత్తరాంధ్రకు “ఫుల్ కిక్కు”.. ఒడిశా నుంచి అక్ర‌మంగా తరలివస్తున్న మద్యం

ఒడిశా నుంచి ఏపీకి మద్యం ఫుల్ గా తరలివస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మ‌ద్యం ఏరులై పారుతోంది. పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మ‌ద్యం స‌ర‌ఫ‌రా క‌ట్ట‌డికి య‌త్నిస్తునే ఉన్నా.. ర‌వాణా మాత్రం ఆగడం లేదు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మ‌ద్యం అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతోంది. ఇటీవల, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఒడిశాలో తయారు చేసిన 1,700 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మ‌ద్యం ర‌వాణా చేస్తున్న ప‌లువురిని అరెస్టు కూడా చేశారు. ఈ ముఠాపై పోలీసులు ఆరా తీశారు. విశాఖ‌ప‌ట్నంలోని కే ఆర్ ఎం  కాలనీలో నాన్-డ్యూటీ పేయిడ్ లిక్క‌ర్‌ నిల్వ చేసినట్టు గుర్తించారు.

మ‌ద్యం కొర‌తతో దందా..

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలో ఒడిశా నుంచి తెచ్చిన ఎన్‌డీపీఎల్ మ‌ద్యాన్ని ప‌లువురు అమ్మ‌కాలు నిర్వ‌హించారు. పండుగ కావ‌డంతో జ‌నం కూడా కొంటున్నారు. గుర్తించిచ స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో బృందం వారిని అదుపులోకి తీసుకొంది.

- Advertisement -


సీసాలు స్వాధీనం..
అధిక లాభార్జ‌న కోసం కొన్ని ముఠాలు ఒడిశా నుంచి ఏపీకి మద్యం రవాణా చేసి అమ్ముతున్నాయ‌ని సెబీ అధికారులు చెబుతున్నారు. అరెస్టులు, త‌నిఖీలు చేస్తున్నా.. ర‌వాణా ఆగడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన మ‌ద్యం సీసాలు వారానికి 100 నుంచి 150 స్వాధీనం చేసుకొంటున్నామ‌ని పేర్కొంటున్నారు.

ప్ర‌భుత్వం మ‌ద్యం కొర‌త‌ను త‌గ్గించేందు ప‌లు య‌త్నాలు చేస్తూనే ఉంది. ఆగ‌స్టులో చివ‌రి వారంలో విశాఖలో మందు బాబులకు ఎక్సైజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇనాళ్లూ మద్యం కావాలంటే క్యూలైన్లో.. నచ్చిన బ్రాండ్ దొరకుతుందో లేదో అని టెన్షన్‌తో ఉండేవారు. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా ప్రీమియం వాక్ ఇన్ స్టోర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్. సీతమ్మదార పుడ్‌ఎక్స్ దగ్గర, అప్పూగర్ దగ్గర ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ లో ప్రయెగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement