Tuesday, May 7, 2024

ఎరుపెక్కిన జాతీయ రహదారి – రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మృత్యు ఘంటికలు మోగిస్తున్నా నెల్లూరు ముంబాయి జాతీయ రహదారి
మర్రిపాడు – జాతీయ రహదారి మనుషుల రక్తం తో ఎరుపెక్కి పోతుంది. సూచిక బోర్డులు లేని కారణంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ర.భ.స అధికారుల నిర్లక్ష్య కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఒక చోట ఇంకొకరు మరొక చోట దుర్మరణం పాలైన సంఘటన అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నుంచి బద్వేలు కి వెళ్తూ పొంగూరు కండ్రిక సమీపంలో మరమ్మతులకు గురై Ap21TS0361 ఆగి ఉన్న లారీని అదే వైపు నుంచి మైదుకూరు మండలం కు వెళుతున్నAp04BB0896 ఓమినీ వ్యాన్ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఎస్.కె సత్తార్ వ్యాపారస్తుడు దుర్గారావు ముందు సీటులో ఉండగా ఆ ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో నెల్లూరు వైపు నుంచి బద్వేలు కి వెళ్తూ ఓమిని వెనకాలే ఉన్నాAp39EE0346 మరో కారు అదుపు తప్పింది. దీంతో బద్వేలు నుంచి నెల్లూరు కి వెళుతున్నAp26CE5757 లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ఈ సంఘటనలో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ వై వి సోమయ్య, అనంతసాగరం ఎస్సై ప్రభాకర్ లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం శతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే సోమవారం సాయంత్రం మర్రిపాడు కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నెల్లూరు వైపు నుంచి బద్వేలు కు బైక్పై వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి బోల్తా పడడంతో నుదిటిన పెద్ద గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్కె షరీఫ్ (30) తన కుమార్తె బద్వేల్ లో పుట్టినరోజు వేడుకలను చేసుకుంటుండగా ఆ కార్యక్రమానికి వెళుతూ మర్రిపాడు అటవీ ప్రాంతం సమీపంలో బైక్ అదుపుతప్పి మృత్యువాత పడ్డాడు. దీంతో ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. అనంతరం మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. మర్రిపాడు ఇన్చార్జి, అనంతసాగరం ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement