Thursday, April 25, 2024

నిషేధిత గుట్కా పట్టివేత

ముత్తారం: ముత్తారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిషేధిత గుట్కాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ముత్తారం కాసర్లగడ్డకు చెందిన ఎండీ కరీమ్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 10వేల విలువ గల విమల్‌, వీ1 పాకెట్లను లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కరీమ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం ముత్తారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement