Sunday, April 21, 2024

వ్యాక్సీన్‌ కేంద్రం వేరేచోట ఏర్పాటు చేయాలి..

గోదావరిఖని: వ్యాక్సిన్‌ కేంద్రాన్ని వేరే చోట ఏర్పాటు- చేయాలని యువజన కాంగ్రెస్‌ నాయకుడు పీక అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి 9వ డివిజన్‌ జనగామ గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో కరోనా నిర్ధారణ -టె-స్టులు, కరోనా వ్యాక్సిన్‌లు ఒకే చోట వేస్తున్నారని, తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. పీహెచ్‌సీకి వచ్చే ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యాక్సిన్‌ సెంటర్‌ను ప్రభుత్వ పాఠశాలలో లేదా అంగన్వాడి సెంటర్‌లో ఏర్పాటు- చేస్తే బాగుంటు-ందన్నారు. అలాగే సమయానికి సిబ్బంది రావడం లేదని, ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూఅసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనిపై మెడికల్‌ ఆఫీసర్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement