Friday, April 26, 2024

గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి :కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు : జిల్లాలో మెరక చేసిన ప్రతి లే అవుట్‌లో గృహ నిర్మాణాలు ప్రారంభించాలని కలెక్టర్‌ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల అధికారులతో బుధవారం ఆయన వీడియో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్ల వారీగా మండల ప్రత్యేక అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉండాలన్నారు. గృహ సముదాయాలకు అప్రోచ్‌ రోడ్ల విషయంలో నిధుల కొరత లేదని అప్రోచ్‌ రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటీఎస్‌ లబ్దిదారుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 15 – 18 ఏళ్ల వయసున్న 75 శాతం మందికి వ్యాక్సిన్‌ వేశామని ఆయన తెలిపారు. సమావేశంలో జేసీలు హరేందిర ప్రసాద్, గణేష్ కుమార్, విదేహ్ ఖరే, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement