Friday, December 6, 2024

AP: సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో ది బెస్ట్‌.. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు జాతీయస్థాయి అవార్డు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నెల్లూరు జిల్లా ఉత్తమ ఫలితాలు కనపరిచింది. దీంతో జాతీయస్థాయిలో శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కలెక్ట‌ర్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక‌య్యారు. దేశవ్యాప్తంగా 780 జిల్లాల్లో 120 రోజుల పాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. దీంట్లో ఉత్తమ పనితీరు కనబరిచిన‌ మొదటి 10 జిల్లాలను కేంద్రం అవార్డులకు ఎంపిక చేసింది. అందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది.
త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఈ అవార్డును అందుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement