Wednesday, May 8, 2024

ఐఫోన్ ల‌వ‌ర్స్‌కి క్రేజీ అప్‌డేట్‌.. రేపు రాత్రికే ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్‌!

టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆపిల్ లాంచ్ ఈవెంట్ రేపు (బుధ‌వారం) రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రేపు (సెప్టెంబర్ 7) రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది. ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే నయా సిరీస్ మొబైళ్లు ఆసక్తికర అప్‌గ్రేడ్స్‌తో వస్తాయని చాలా లీక్‌లు వచ్చాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్‌పై చాలా హైప్ ఉంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో ఆపిల్ వాచ్‌ సిరీస్ 8, కొత్త ఐప్యాడ్ మోడల్, సెకండ్ జనరేషన్ ఎయిర్‌పోడ్స్ ప్రో, న్యూ మ్యాక్‌బుక్‌ను కూడా ఆపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌, యూట్యూబ్ చానెల్‌లో ఈ ఈవెంట్‌ని లైవ్ ద్వారా చూడొచ్చు. ఐఫోన్ 14 సిరీస్‌పై ఇప్పటి వరకు వెలువడిన అంచనాలు, లీక్స్ ఎలా ఉన్నాయో టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ తెలిపిన వివ‌రాల‌ను తెలుసుకుందాం..

ఐఫోన్ 14 అంచనా ధర..

ఐఫోన్ 14 ధర.. ఐఫోన్ 13 లాంచ్ ధర కంటే తక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. గత ఏడాది లాంచ్ అయిన సమయంలో ఐఫోన్ 13 ప్రారంభ ధర అమెరికాలో 799 డాలర్లుగా ఉంది. అయితే ఐఫోన్ 14 (128 జీబీ మోడల్)‌ను ఆపిల్ ఈసారి 749 డాలర్లకే (సుమారు రూ.60వేలు) తీసుకొస్తుందని అంచనాలున్నాయి. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర 849 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్ ధరలను ఆపిల్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. అమెరికాతో పోలిస్తే ఇండియాకు వచ్చేసరికి ఐఫోన్‌ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయంటున్నారు అన‌లిస్టులు.

ఇక‌.. ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను ఐఫోన్ 14 మోడ‌ల్ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా కోసం నాచ్ కూడా చిన్న సైజ్‌లోనే ఉంటుందని లీకైన ఫొటోల ద్వారా వెల్లడైంది. ఇక iPhone 14 Pro, iPhone 14 Pro Max మోడల్స్‌లో యాపిల్ బయోనిక్ ఏ16 ప్రాసెసర్‌ ఉంటుంది. iPhone 14, iPhone 14 Max మొబైళ్లు.. గత బయోనిక్ 15 ప్రాసెసర్‌తోనే రానున్నాయని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement