Tuesday, October 8, 2024

Muttukuru – మోటారు, టైర్ల దొంగలు దొరికేశారు

ముత్తుకూరు నవంబర్ 21 (ప్రభ న్యూస్) చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేస్తున్న ముగ్గురు దొంగలను కృష్ణపట్నం పోర్ట్ సర్కిల్ పోలీస్ యంత్రాంగం చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు దొంగలు పోలీసులకు పట్టు పడడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురునిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియాకు చూపెట్టారు. మంగళవారం సాయంత్రం ముత్తుకూరు పోలీస్ స్టేషన్ నందు పోలీస్ శాఖ మీడియా సమావేశం లో. కృష్ణపట్నం పోర్ట్ సర్కిల్ సిఐ వెంకటరెడ్డి వివరాలు తెలిపారు..

22 మోటార్లు, 8 లారీ టైర్లు స్వాధీనం.

ముగ్గురు దొంగలను పోలీస్ శాఖ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి సుమారుగా 5 లక్షలు విలువ చేసేటటువంటి వ్యవసాయ మోటర్లు, ఎనిమిది లారీ టైర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. . ఈ నేపథ్యంలో దొంగలను పట్టుకోవడంలో సొమ్మును రికవరీ చేయడంలో ప్రతిభ చాటిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు శివకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లు పెంచలయ్య , అశోక్ కుమార్, కానిస్టేబుల్ లు వెంకటరమణ, వెంకటేశ్వర్లు, నాగార్జున, సుమన్, పెంచలయ్యలను పోలీస్ శాఖ ప్రశంసిస్తూ రివార్డులు ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement